న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ రా అండ్ వయొలెంట్ చిత్రం ‘ది ప్యారడైజ్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. వారి అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు మేకర్స్.
ఇక నేడు ‘ది ప్యారడైజ్’ చిత్రంలోని ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. జడల్ అనే పాత్రలో నాని లుక్ కేక పెట్టిస్తుంది. అయితే, అతని పాత్రకు సంబంధించిన తీరును తాజాగా మరో పోస్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘ఆడి తీరు.. నేను ఇంచు కూడా కదల.. యుద్ధాన్ని మొదలుపెట్టండి.. వెయిటింగ్’’ అంటూ నాని సెంటర్‌లో కుర్చీ వేసుకుని కూర్చున్న తీరు అదిరిపోయింది.
నాని లుక్స్‌లో ఫైర్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్‌పై చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. 2026 మార్చి 26న ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
