ఆ సీనియర్ హీరోతో శ్రీలీల రొమాన్స్.. ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా..?

sreeleela 4

యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంది. స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోల సరసన హీరోయిన్‌గా నటిస్తూ, వారితో పోటీపడి డ్యాన్స్ వేస్తూ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తోంది. ఇక టాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీల్లో కూడా ఈ బ్యూటీ ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది.

ఇప్పటికే బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన శ్రీలీల, అటు తమిళ్‌లో కూడా గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. శివకార్తికేయన్ ‘పరాశక్తి’ సినిమాతో తమిళంలో గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది ఈ చిన్నది. అయితే, ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసిందట శ్రీలీల.

తమిళ హీరో అజిత్ నెక్స్ట్ సినిమాలో ఆయనతో రొమాన్స్ చేసే పాత్రలో శ్రీలీల నటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమాలో అజిత్‌తో శ్రీలీల రొమాన్స్ ఏ లెవెల్‌లో ఉంటుందో చూడాలి.

Exit mobile version