మర్చిపోయినందుకు క్షమించండి.. వారికి కృతజ్ఞతలు – ఎన్టీఆర్

wAR2pRE

‘ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌’ కలయికలో రాబోతున్న మల్టీస్టారర్ ‘వార్ 2′. నిన్న రాత్రి ఈ సినిమా ముందస్తు వేడుక జరిగింది. ఈ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఐతే, తెలంగాణ ప్రభుత్వ సహకారం వల్లే ఈవెంట్‌ ప్రశాంతంగా జరిగిందని ఎన్టీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. వేదికపై ఈ విషయం చెప్పడం మర్చిపోయినందుకు క్షమాపణ చెప్పారు. ఇంతకీ, ఈ అంశం పై ఎన్టీఆర్ ఏం మాట్లాడారు అంటే.. ‘వేదికపై ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పడం మర్చిపోయినందుకు క్షమించాలి. ఈ ఈవెంట్‌కు సహకారం అందించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు’ అని తెలిపారు.

ఎన్టీఆర్ ఇంకా మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు అలాగే హైదరాబాద్‌ పోలీస్ డిపార్ట్‌మెంట్‌ వారందరికీ నా కృతజ్ఞతలు. మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. మీరు చాలా సహకారం అందించారు. అభిమానులను ఎంతో బాధ్యతగా చూసుకున్నారు. వారి ఆనందానికి మీరు కూడా కారణమయ్యారు’’ అంటూ ఎన్టీఆర్‌ చెప్పుకొచ్చారు. ‘వార్‌ 2’ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Exit mobile version