స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో, వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై విజయ్ పాల్ రెడ్డి అడిదల నిర్మాణంలో, మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ‘త్రిబాణధారి బార్బరిక్’ ఆగస్ట్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్‌లో సత్యరాజ్, ఉదయభాను, వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సందర్భంగా నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల మీడియాతో ముచ్చటించారు.
ఈ సినిమా ప్రత్యేకతల గురించి మాట్లాడుతూ.. ప్రారంభంలో చిన్న బడ్జెట్‌గా ప్లాన్ చేసినా, కథ డిమాండ్ మేరకు భారీ స్థాయిలో తెరకెక్కించామని తెలిపారు. మలయాళ నేచురల్ స్టైల్‌తో, తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సినిమా రూపొందించామని నిర్మాత తెలిపారు. మైథలాజికల్ టచ్‌తో ఉన్న ఈ కథ ప్రీమియర్ షోలలో అద్భుతమైన స్పందన పొందిందని అన్నారు.
టెక్నికల్ హైలైట్స్ మరియు నటీనటుల గురించి మాట్లాడుతూ.. మారుతి సపోర్ట్‌తో, కొత్త కాన్సెప్ట్‌తో పాటు ఇన్‌ఫ్యూజన్ బ్యాండ్ మ్యూజిక్, కుశేందర్ రమేష్ రెడ్డి కెమెరా వర్క్ ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయని తెలిపారు. సత్యరాజ్ ఇంతవరకు చేయని పాత్రలో మెప్పించబోతున్నారని.. ఉదయభాను సెకండ్ ఇన్నింగ్స్‌కు ఇది మంచి బ్రేక్ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇక తమ బ్యానర్ నుంచి రాబోయే ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం బ్యూటీ అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కూడా నిర్మాణంలో ఉందని.. తర్వాత హారర్ కామెడీతో పాటు మరికొన్ని డిఫరెంట్ ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయని నిర్మాత వెల్లడించారు.
