మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమానే పెద్ది. భారీ రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మంచి అంచనాలు సెట్ చేసుకుంది. ఇక ఈ సినిమా నుంచి ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన చికిరి చికిరి సెన్సేషనల్ చార్ట్ బస్టర్ అయ్యింది.
ఇక నెక్స్ట్ సాంగ్ గా ఒక మాస్ సాంగ్ ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సాంగ్ కోసం ఎప్పుడు నుంచో అభిమానులు ఎదురు చూస్తుండగా ఈ సాంగ్ కోసం లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. నిజానికి ఈరోజే ఈ సాంగ్ పై అప్డేట్ వస్తుంది అని కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. అలాగే మార్చ్ మొదటి వారం లోనే పెద్ది రెండో సాంగ్ బయటకి వస్తుందని మరో టాక్.
మరి దానిపైనే నేడు అధికారిక క్లారిటీ ఏమన్నా వస్తుందేమో చూడాలి. ఇక ఈ సాంగ్ ఎలాంటి సెన్సేషన్ ని సెట్ చేస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాలో శివ రాజ్ కుమార్, జగపతి బాబు తదితరులు నటిస్తుండగా వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ ఏప్రిల్ 30న సినిమా గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి రాబోతుంది.
