యువతుల పై వేధింపులు.. హీరోయిన్ పై కేసు నమోదు !

dimple hayathi

హాట్ బ్యూటీ డింపుల్‌ హయాతి మరోసారి మళ్లీ వార్తల్లోకెక్కింది. తాజాగా ఆమె పై పోలీసులు కేసు నమోదు చేశారు. డింపుల్‌ హయాతి ప్రస్తుతం షేక్‌ పేటలోని వంశీరామ్ వెస్ట్ వుడ్స్ అపార్ట్‌మెంటులో ఉంటుంది. అయితే, డింపుల్‌ హయాతి రెండు కుక్కలను పెంచుకుంటుంది. ఆ కుక్కల సంరక్షణకు ఓ ఏజెంట్‌ని సంప్రదించారు. ఆ ఏజెంట్ ఒడిశా నుంచి ఇద్దరు అమ్మాయిలని తీసుకొచ్చి పనిలో పెట్టింది. రెండ్రోజులు అంతా బాగానే నడిచింది. ఆ తర్వాత ఏమైందో ఏమో గానీ, డింపుల్ వాళ్లని తిట్టి పంపించేసింది.

ఐతే, ఆ ఇద్దరు యువతలు మాత్రం డింపుల్ హయాతీ నివాసముంటోన్న అపార్ట్‌మెంట్ వద్ద రోడ్డు పక్కన దీనంగా కూర్చోగా, ఆ మహిళలను పనిలో పెట్టిన ఏజెంట్ ఆ వీడియో తీసి హీరోయిన్ బాగోతాన్నంతా బయట పెట్టింది. పని చేయించుకుని డబ్బులు ఇవ్వకపోగా.. తమను బూతులు తిట్టింది అని, పైగా మీరు నన్నేం చేయలేరంటూ డింపుల్ రెచ్చిపోయిందని సదరు బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మరి ఈ వివాదంలో నిజం ఎంత అనేది తేలాల్సి ఉంది.

case filed against dimple hayathi over maid complaint

Exit mobile version