సమీక్ష : ‘అఖండ 2′ – ఆకట్టుకునే డివోషనల్ వైల్డ్ యాక్షన్ డ్రామా !

Akhanda 2 Movie

విడుదల తేదీ : డిసెంబర్ 12, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : బాలకృష్ణ, సంయుక్త మీనన్, హర్షాలీ మల్హోత్రా, కబీర్ సింగ్, శశ్వత చటర్జీ తదితరులు.

దర్శకుడు : బోయపాటి శ్రీను
నిర్మాతలు : రామ్ ఆచంట, గోపి ఆచంట
సంగీత దర్శకుడు : థమన్ ఎస్
సినిమాటోగ్రాఫర్ : సి రామ్ ప్రసాద్, సంతోష్ డి డెటాకే
ఎడిటర్ : తమ్మిరాజు

సంబంధిత లింక్స్ :  Akhanda 2 Movie ట్రైలర్ 

నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం ‘అఖండ 2 (Akhanda 2 Movie). కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్ళి చూద్దాం.

Akhanda 2 Movie కథ :

బాలమురళీకృష్ణ (బాలయ్య) కుమార్తె జనని (హర్షాలి మల్హోత్రా) సైంటిస్ట్. అతి తక్కువ వయసులోనే మంచి ప్రతిభ కలిగిన జనని సైనికుల కోసం తన టీమ్ తో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. మరోవైపు శత్రు దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఇండియా పై దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చోటుచేసుకున్న ఓ అనుకోని ఘటన కలకలం రేపుతుంది. పైగా ఆ ఘటన ప్రజల్లో దేవుడి పై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోంది. మరోవైపు ఉద్రిక్త సంఘటనలు వరుసగా చోటుచేసుకుంటాయి. ఆ ఉద్రిక్తలను సృష్టించిన దుండగులపై అఖండ (బాలయ్య) ఎలా విరుచుకుపడ్డాడు ?, దేశాన్ని ఎలా కాపాడాడు ?, ప్రజల ప్రాణాలను ఎలా రక్షించాడు ?, ఇంతకీ.. అఖండ కన్నతల్లి కోరిక తీరిందా ? లేదా ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ఎప్పటిలాగే, రెండు పాత్రల్లో బాలయ్య అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అఖండగా బాలయ్య అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. బాలకృష్ణ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో, ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు ‘వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్’ తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ, తన పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో బాలయ్య ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు.

నెగిటివ్ పాత్రలో ఆది పినిశెట్టి ఆకట్టుకున్నాడు. ఆది పినిశెట్టి – బాలయ్య మధ్య సాగే యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. తన పాత్రకు ఆది పినిశెట్టి ప్రాణం పోశారు. సంయుక్త మీనన్ కి గ్లామర్ పాత్ర దొరికింది. ఐతే, ఆమె ఎండింగ్ ఎమోషనల్ గా బాగుంది. మరో కీలక పాత్రలో హర్షాలీ మల్హోత్రా నటన కూడా బాగుంది. అలాగే, కబీర్ సింగ్, శశ్వత చటర్జీ లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

మొత్తానికి బాలయ్య ఎలివేషన్లు.. భారీ యాక్షన్ ఘట్టాలు.. మాస్ డైలాగ్స్.. బాలయ్య అభిమానులకు బాగా నచ్చుతాయి. ముఖ్యంగా అఘోరా పాత్ర కనిపించిన ప్రతిసారీ ఇంట్రడక్షన్ సీన్ లాగా స్లో మోషన్ షాట్లతో ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా బోయపాటి సీన్స్ ను డిజైన్ చేశాడు. మాస్ ప్రేక్షకులకు మాత్రం పూనకాలు తెప్పించే కొన్ని సీన్స్ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

‘అఖండ 2’ (Akhanda 2) కథా నేపథ్యంలో డెప్త్ ఉన్నా.. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు బాగున్నా.. కొన్ని కీలకమైన ఇన్సిడెంట్స్ మరీ సినిమాటిక్ గా అనిపిస్తాయి. దీనికితోడు కథనం అనేక సమస్యలు చుట్టూ సాగుతుంది. దీంతో, మెయిన్ ప్లాట్ లోని మెయిన్ కాన్ ఫ్లిక్ట్ సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదు. నిజానికి భారీ విజువల్స్ తో వచ్చే హై యాక్షన్ సీన్స్ బాగా ఆకట్టుకున్నా.. కథలో భాగంగా వచ్చే కొన్ని సీన్స్ మాత్రం సినిమా స్థాయికి తగ్గట్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. అలాగే మెయిన్ యాక్షన్ సీక్వెన్సెస్ లో ఉన్నంత హైప్ ను సినిమా మొత్తం కంటిన్యూ చేయలేక పోయారు. ఇక బాలయ్య – విలన్ల మధ్య ట్రాక్ ఇంకా బెటర్ గా ఉండి ఉంటే బాగుండేది.

సాంకేతిక విభాగం :

టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. థమన్ ఎస్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. అదే విధంగా సి రామ్ ప్రసాద్, సంతోష్ డి డెటాకే సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ల పనితనం చాలా బాగుంది. ఎడిటర్ తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు బోయపాటి తన దర్శకత్వంతో ఆకట్టుకున్నారు.

తీర్పు :

డివోషనల్ టచ్ తో హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రం చాలా బాగా ఆకట్టుకుంది. బాలయ్య ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఫుల్ కిక్ ను ఇస్తోంది. గ్రాండ్ యాక్షన్ విజువల్స్ తో పాటు బాలయ్య స్క్రీన్ ప్రెజెన్సీ, మరియు వైల్డ్ యాక్షన్ సీన్స్, అండ్ మదర్ సెంటిమెంట్ చాలా బాగున్నాయి. కాకపోతే, కొన్ని యాక్షన్ సన్నివేశాలు రెగ్యులర్ గా అనిపిస్తాయి. కానీ, ఓవరాల్ గా ఈ సినిమా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

Exit mobile version