‘జనవరి 12 విడుదల’ నుంచి కృతి శెట్టికి సర్ ప్రైజ్ !

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్‌రామ్ కాంబినేషన్‌లో అనిల్ రావిపూడి తెరక్కిస్తున్న సినిమా ‘జనవరి 12 విడుదల’. ఇక ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కాగా కృతి శెట్టి పుట్టినరోజు సందర్భంగా, ‘జనవరి 12 విడుదల’ చిత్ర బృందం ఆమెకు ఒక ప్రత్యేకమైన సర్ప్రైజ్ ఇచ్చింది. కృతి శెట్టి పాత్రకు సంబంధించిన ‘ఫస్ట్-లుక్’ పోస్టర్‌ను విడుదల చేసి, ఆమెను ‘దీపు’గా పరిచయం చేశారు. ఈ పోస్టర్‌లో కృతి శెట్టి గులాబీ రంగుల కలయికతో కూడిన సంప్రదాయ లంగా ఓణిలో కనిపించి ఆకట్టుకుంది.

గుడి నేపథ్యంలో ఆమె పోజు ఇస్తుండగా, ఆమె చిరునవ్వు పోస్టర్‌కు ఆహ్లాదకరమైన అందాన్ని జోడించింది. ఈ ఫస్ట్-లుక్ ఆమె పాత్ర లుక్ ను ఎలివేట్ చేసింది. సాహు గారపాటి నిర్మాణంలో రానున్న ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. అన్నట్టు ఈ సినిమాలో అల్ట్రా స్టైలిష్ లుక్‌లో వెంకీ కనిపిస్తారట.. ఈ లుక్ కి పూర్తి భిన్నంగా కళ్యాణ్ రామ్ లుక్ ఉంటుందని తెలుస్తోంది. పైగా స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. ఇక నవంబర్ లోపు ఈ సినిమా షూట్ పూర్తి చేయాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు. మొత్తానికి సంక్రాంతి ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేసేలా కామెడీ, ఎమోషన్, యాక్షన్ కలగలిసిన పూర్తి ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతుంది.

Exit mobile version