ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన దుల్కర్ “కాంత”

Kaantha Movie Review

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు సెల్వరాజ్ సెల్వమని తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ పీరియాడిక్ సినిమానే కాంత. రానా దగ్గుబాటి అలాగే సముద్రకని లాంటి వెర్సటైల్ నటులు కూడా కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ అయితే సాధించింది కానీ అనుకున్న రేంజ్ సక్సెస్ అయితే కాలేదు.

మరి ఫైనల్ గా ఈ సినిమా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో నేటి నుంచి ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. సో అప్పుడు మిస్ అయ్యినవారు ఈ సినిమాని చూడొచ్చు. ఇక ఈ సినిమాకు దుల్కర్, రానాలు నిర్మాణం వహించారు.

Exit mobile version