‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ సింగిల్ కి ఊహించని రికార్డు రెస్పాన్స్!

ustaad bhagat singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రమే ఉస్తాద్ భగత్ సింగ్. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా మంచి హైప్ ని సెట్ చేసుకోగా దీని నుంచి దేఖేలంగా సాలా అనే ఫస్ట్ సింగిల్ ని మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ సాంగ్ కి విజువల్స్ గా పవన్ కళ్యాణ్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో డామినేట్ చేసి సోషల్ మీడియాని కమ్మేస్తే యూట్యూబ్ లో కూడా ఈ సాంగ్ కి ఊహించని విధంగా రికార్డు రెస్పాన్స్ వచ్చేస్తోంది.

కేవలం 15 గంటల్లోనే ఈ సాంగ్ కి ఏకంగా 20 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చేసాయి. దీనితో మన టాలీవుడ్ నుంచి బిగ్గెస్ట్ రెస్పాన్స్ అందుకున్న ఫస్ట్ సింగిల్ గా ఇది నిలిచింది. ఇంట్రెస్టింగ్ గా ఇది ఓజి ఫస్ట్ సింగిల్ కంటే చాలా ఎక్కువే. దీనితో ఈ సాంగ్ ఏ రేంజ్ లో ఆడియెన్స్ ని రీచ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version