ప్రస్తుతం ప్రభాస్ చేతిలో వరుస ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకవైపు ‘ఫౌజీ’ షూటింగ్లో పాల్గొంటూనే, మరోవైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న ‘స్పిరిట్’, (Spirit )మరియు ‘కల్కి 2’ కోసం సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ప్రభాస్‌కు సంబంధించిన ఒక ఫోటో తెగ వైరల్ అవుతోంది. అద్దం ముందు నిలబడి సిగార్ వెలిగిస్తున్న ఈ లుక్ ‘స్పిరిట్’ సినిమాలోని లీక్డ్ స్టిల్ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
అయితే, ఈ ఫోటో నిజంగా సినిమా సెట్స్ నుంచి లీక్ అయిందా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్. కొందరు ఇది ఒరిజినల్ స్టిల్ అని నమ్ముతుంటే, మరికొందరు మాత్రం ఇది కేవలం ఏఐ ద్వారా సృష్టించిన ఇమేజ్ అని కొట్టిపారేస్తున్నారు. చిత్ర యూనిట్ దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పష్టత ఇవ్వలేదు. ఏది ఏమైనా, ఆ ఫోటోలో ప్రభాస్ లుక్ మాత్రం అత్యంత స్టైలిష్‌గా ఉండి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
భారీ అంచనాలున్న ఈ సినిమాలో త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రభాస్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని సమాచారం ఉండటంతో, ఈ ప్రాజెక్టుపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
