మెగాస్టార్ లుక్ పై డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !

మన శంకర వరప్రసాద్ గారు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో “మన శంకర వరప్రసాద్ గారు” అనే ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ రాబోతుంది. ఈ సినిమాలో మరో హీరో వెంకటేష్ కనిపించబోతున్న సంగతి తెలిసిందే. కాగా 2026 సంక్రాంతికి ఈ సినిమాని తీసుకురానున్నారు. ఐతే, ఈ సినిమా ప్రచారంలో భాగంగా పాల్గొన్న అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి లుక్‌ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ, అనిల్ రావిపూడి ఏం మాట్లాడారు అంటే.. ‘ఈ సినిమా కోసం చిరు.. ‘సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌’ లుక్‌ ప్రయత్నిస్తానని అన్నారు.

ఐతే, తానే అందుకు నో చెప్పినట్లు అనిల్ రావిపూడి తెలిపారు. బయట ఎలా ఉన్నారో సినిమాలోనూ అలానే చూపిస్తానని చిరుకి తాను చెప్పినట్లు అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. 25 ఏళ్ల క్రితం చిరంజీవి ఎంత స్లిమ్‌గా, అందంగా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారని అనిల్ కామెంట్స్ చేశారు. ఇక సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా గురించి మెగాస్టార్ ఆ మధ్య మాట్లాడుతూ.. ‘ఈ సినిమా పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని.. ఈ మూవీ కథ తనకు బాగా నచ్చిందని చెప్పారు.

Exit mobile version