దర్శకుడు శ్రీను వైట్ల – హీరో శర్వానంద్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా పై కొత్త అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం శ్రీను వైట్ల లాంగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర యూనిట్ షూటింగ్ కోసం సన్నాహాలు చేసుకుంటోంది. జనవరి మూడో వారం నుంచి ఈ సినిమా ఓపెనింగ్ సన్నివేశాలను చిత్రీకరిస్తారని, అనంతరం ఫిబ్రవరిలో జరగబోయే రెండో షెడ్యూల్ లో శర్వానంద్ పై ఓ సాంగ్ ను షూట్ చేస్తారని తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమాలో ‘మ్యాడ్’, ‘8 వసంతాలు’ ఫేమ్ అనంతిక సనీల్ కుమార్ హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
కాగా ఈ బ్యూటీ శర్వానంద్ సరసన ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి. కాగా గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ‘విశ్వం’ ఏవరేజ్ గా నిలిచింది. దీంతో, ఎలాగైనా మళ్ళీ టాలీవుడ్ లో తన తర్వాత సినిమాతో బిజీ అయ్యేందుకు శ్రీనువైట్ల తెగ కష్ట పడుతున్నాడట. ఈ క్రమంలోనే శర్వాకి కథ చెప్పాడు. కాగా తెలియని వయసులో ఆవేశంలో చేసిన ఓ పని కారణంగా హీరో లైఫ్ లో జరిగే డ్రామా చాలా బాగుంటుందట. ఈ ఏడాది చివర్లో వీరిద్దరి కలయికలో సినిమా మొదలు అవుతుందట. ఈ సినిమాలో మరో సీనియర్ హీరో కూడా కనిపిస్తాడని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది.
