పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది రాజాసాబ్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను హారర్ కామెడీ జోనర్లో రూపొందించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ సింగిల్ సాంగ్ ‘రెబల్ సాబ్’కి కూడా మంచి ఆదరణ దక్కింది.
అయితే, ఇప్పుడు ఈ సినిమా నుంచి ‘సహానా సహానా’ అనే రెండో సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ పాటను డిసెంబర్ 17న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రోమో ద్వారా వెల్లడించారు. ఇక ఈ పాటను హైదరాబాద్‌లోని ఏఎంబి సినిమాస్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుందట.
ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.
