ప్రతిష్టాత్మక సురేష్ ప్రొడక్షన్స్ డి.సురేష్ బాబు సమర్పణలో రూపొందుతున్న యూత్‌ఫుల్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా ‘పతంగ్’ డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. సినిమాటిక్ ఎలిమెంట్స్, రిషన్ సినిమాస్, మాన్‌సూన్ టేల్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మాతలు. ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
హైదరాబాద్‌లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు దేవకట్టా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ ఎంతో ఎనర్జిటిక్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా ఉందని ఆయన ప్రశంసించారు. యూత్‌కు కావాల్సిన ఫ్రెండ్షిప్, లవ్, మ్యూజిక్, స్పోర్ట్స్ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయని, థియేటర్లలో ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నటీనటులు, నిర్మాతలు కూడా తమ అనుభవాలను పంచుకున్నారు. వంశీ పూజిత్ సినిమా విజువల్స్, కైట్ కాంపిటీషన్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయని అన్నారు. ప్రణవ్ కౌశిక్ ఇది తన తొలి సినిమా అని, కంటెంట్ పరంగా పెద్ద సినిమా అనిపిస్తుందని చెప్పారు. సహ నిర్మాత రమ్య వేములపాటి, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు ‘పతంగ్’ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించి ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
