డకాయిట్’ టీజర్‌కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

Dacait

ట్యాలెంటెడ్ హీరో అడవి శేష్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘డకాయిట్’ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు షానీల్ డియో తెరకెక్కిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి మేకర్స్ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.

‘డకాయిట్’ చిత్ర టీజర్‌ను డిసెంబర్ 18న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో తెరకెక్కిస్తుండటంతో.. ఈ సినిమా నుండి 2 టీజర్లు రెండు వేర్వేరు నగరాల్లో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ముంబైలోని గైటీ గ్యాలక్సీలో ఉదయం 11 గంటలకు టీజర్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారని.. హైదరబాద్‌లోని AAA సినిమాస్‌లో సాయంత్రం 6.30 గంటలకు మీడియా మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ ఉండబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇక ఈ సినిమాలో అందాల భామ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ సమర్పిస్తుండగా సుప్రియ యార్లగడ్డ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను మార్చి 19న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

Exit mobile version