యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు రోషన్ కనకాల హీరోగా నటించగా సాక్షి హీరోయిన్ గా పబ్లిక్ స్టార్ బండి సరోజ్ సాలిడ్ విలన్ రోల్ లో దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కించిన వైల్డ్ లవ్ స్టోరీ చిత్రం ‘మోగ్లీ’ కోసం తెలిసిందే.
అఖండ 2 తో పోటీకి వచ్చినప్పటికీ ఈ సినిమా ప్రీమియర్స్ ఇంకా డే 1 మంచి ఓపెనింగ్స్ సాధించింది. ఇక రెండో రోజు కూడా అనుకున్న విధంగానే బెటర్ గా ఈ సినిమా పెర్ఫామ్ చేసింది.
రెండో రోజు మొదటి రోజుకంటే ఎక్కువ వసూళ్లు సాధించి మొత్తం రెండు రోజుల్లో 2.75 కోట్ల గ్రాస్ ని అందుకుంది. దీనితో రోషన్ సినిమా బాగానే పెర్ఫామ్ చేస్తుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి కాల భైరవ సంగీతం అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.
