‘ఛాంపియన్’ కోసం చిరుత.. ట్రైలర్ కోసం క్రేజీ ప్లాన్

rAMCHARAN champion

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రోషన్ మేక హీరోగా ప్రదీప్ అద్వైతం కాంబినేషన్ లో వైజయంతి బ్యానర్ లో వస్తున్న అవైటెడ్ చిత్రమే “ఛాంపియన్”. ఎప్పుడో మొదలైనప్పటికీ ఈ సినిమాపై ఇప్పటికీ కూడా మంచి బజ్ నెలకొంది. రీసెంట్ గా వచ్చిన చార్ట్ బస్టర్ సాంగ్ గిర గిర సోషల్ మీడియాలో హవా చూపిస్తుంది. అయితే ఈ సినిమా కోసం ఇప్పుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కదిలాడు.

ఈ సినిమా తాలూకా అవైటెడ్ ట్రైలర్ కట్ ని మేకర్స్ ఇప్పుడు రామ్ చరణ్ చేతులు మీదగా రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఈ డిసెంబర్ 18న ఈ ట్రైలర్ ని రామ్ చరణ్ రిలీజ్ చేస్తాడట. అది కూడా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి రామ్ చరణ్ హాజరై మరీ లాంచ్ చేయనున్నారట. సో ఇది మాత్రం సినిమాకి మంచి బూస్టప్ ఇచ్చే మూవ్ అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్ అలాగే ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ మరియు కాన్సెప్ట్ ఫీమ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version