‘రాజా సాబ్’ రెండో సాంగ్ కి టైం వచ్చేసింది!

therajasaab

రెబల్ సాబ్ ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్ అలాగే హీరోయిన్స్ రిద్ధి కుమార్ ఇంకా మాళవిక మోహనన్ లు హీరోయిన్స్ గా దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే “ది రాజా సాబ్”. ప్రభాస్ నుంచి చాలా కాలం తర్వాత సాలిడ్ ట్రీట్ ని మేకర్స్ ప్లాన్ చేస్తుండగా నేడు ఈ సినిమా నుంచి రెండో సాంగ్ ని ఈవెంట్ తో లాంచ్ చేస్తున్నారు.

ఈ సాయంత్రం 5 గంటల నుంచే లులు మాల్ లో ఈవెంట్ తో ప్లాన్ చేస్తుండగా ఆన్లైన్ లో అయితే సాయంత్రం 6 గంటల 35 నిమిషాలకి అలా వదలనున్నట్టు కన్ఫర్మ్ చేశారు. సో ఫ్యాన్స్ ఈ టైం కి రెడీ అయిపోతే సరిపోతుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా పీపుల్ మీడియా వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ జనవరి 9న గ్రాండ్ గా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది.

Exit mobile version