Vijay Hazare Trophy: కోహ్లీ, రోహిత్, హార్దిక్ రీ-ఎంట్రీ – ఒక్కో మ్యాచ్‌కి ఎంత రెమ్యునరేషనో తెలుసా?

Vijay-Hazare-Trophy

ఈసారి విజయ్ హజారే ట్రోఫీ ( Vijay Hazare Trophy ) సామాన్యంగా ఉండబోవడం లేదు. టీమిండియా సూపర్ స్టార్స్ అంతా తమ తమ రాష్ట్రాల జట్ల (State Teams) తరఫున బరిలోకి దిగుతుండటంతో దేశవాళీ క్రికెట్‌కు కొత్త కళ వచ్చింది. కేవలం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాత్రమే కాదు, టీమిండియాలోని చాలామంది రెగ్యులర్ ప్లేయర్స్ ఈ టోర్నమెంట్‌లో ఆడుతుండటం విశేషం.

లిస్ట్‌లో ఉన్న భారీ స్టార్స్ వీరే!

తాజాగా విడుదలైన ప్లేయర్ల లిస్ట్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎవరెవరు ఏ టీమ్ తరఫున ఆడుతున్నారో చూస్తే:

ముంబై (Mumbai): కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, సర్ఫరాజ్ ఖాన్ వంటి హిట్టర్లు ఉన్నారు.

ఆంధ్రా (Andhra): ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy).

ఢిల్లీ (Delhi): విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, హర్షిత్ రాణా.

బరోడా (Baroda): హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా.

బెంగాల్ (Bengal): ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ.

కర్ణాటక (Karnataka): కేఎల్ రాహుల్, ప్రసిద్ధ్ కృష్ణ, కరుణ్ నాయర్.

పంజాబ్ (Punjab): శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్.

ఇతర ముఖ్య ఆటగాళ్లు: జార్ఖండ్ నుంచి ఇషాన్ కిషన్, కేరళ నుంచి సంజు శాంసన్, సౌరాష్ట్ర నుంచి రవీంద్ర జడేజా, యూపీ నుంచి రింకూ సింగ్, గుజరాత్ నుంచి రవి బిష్ణోయ్, మహారాష్ట్ర నుంచి రుతురాజ్ గైక్వాడ్ వంటి స్టార్స్ కూడా ఆడుతున్నారు.

స్టేడియం మార్పు.. ఫ్యాన్స్‌కి నిరాశ

బెంగళూరులోని ఫేమస్ ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్‌లు చూడాలని ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ, సెక్యూరిటీ కారణాల వల్ల కర్ణాటక పోలీసులు అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో మ్యాచ్‌లను బెంగళూరులోని ‘బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ (BCCI CoE) గ్రౌండ్‌కు మార్చారు. అక్కడ ప్రేక్షకులకు ఎంట్రీ లేకపోవడంతో అభిమానులు టీవీల్లోనే తమ ఫేవరెట్ స్టార్స్ ఆటను చూడాల్సి ఉంటుంది.

మ్యాచ్ ఫీజు ఎంతంటే?

కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఉండే ఈ స్టార్స్, దేశవాళీ క్రికెట్ ఆడితే ఎంత తీసుకుంటారనే ఆసక్తి అందరిలో ఉంది. బీసీసీఐ రూల్స్ ప్రకారం, 40కి పైగా మ్యాచ్‌ల అనుభవం ఉన్న సీనియర్లకు రోజుకు రూ. 60,000 (అరవై వేల రూపాయలు) మ్యాచ్ ఫీజుగా ఇస్తారు. రోహిత్, కోహ్లీ, జడేజా లాంటి సీనియర్లంతా ఈ కేటగిరీలోకే వస్తారు. డబ్బు కంటే ప్రాక్టీస్ కోసం, సొంత రాష్ట్రం కోసం ఆడాలనే ఉద్దేశంతోనే వీరు మైదానంలోకి దిగుతున్నారు.

Exit mobile version