సమీక్ష: ‘దండోరా’ – మెప్పించే హానెస్ట్ అటెంప్ట్

Dhandoraa

విడుదల తేదీ : డిసెంబర్ 25, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : శివాజీ, నవదీప్, నందు, బిందుమాధవి తదితరులు
దర్శకుడు : మురళీకాంత్ దేవాసోత్
నిర్మాతలు : రవీంద్ర బెనర్జీ ముప్పనేని
సంగీత దర్శకుడు : మార్క్ కె రాబిన్
సినిమాటోగ్రాఫర్ : వెంకట్ ఆర్. శాకమూరి
ఎడిటర్ : సృజన అడుసుమిల్లి

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

ఈ క్రిస్మస్ రేస్ లో రిలీజ్ కి వచ్చిన తాజా చిత్రాల్లో నందు, శివాజీ అలాగే రవి కృష్ణ తదితరులు నటించిన చిత్రం ‘దండోరా’ కూడా ఒకటి. కులాల ఘర్షణల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాని మేకర్స్ ప్రమోషన్స్ తో మంచి బజ్ ని తెచ్చుకున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

2004 సమయం ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన ఓ రైతు శివాజీ (శివాజీ) తన కొడుకు, కూతురు విష్ణు (నందు) అలాగే సుజాత (మాణిక) లతో జీవనం సాగిస్తారు. అయితే అదే ఊరికి చెందిన రవి (రవి) ఒక తక్కువ కులానికి చెందినవాడు కాగా తాను తనకంటే ఎక్కువ కులానికి చెందిన అమ్మాయి సుజాతని ప్రేమిస్తాడు. కానీ ఇక్కడ నుంచే అసలు సమస్యలు మొదలవుతాయి. తనకంటే ఎక్కువ కులపు అమ్మాయిని ప్రేమించడం మూలాన జరిగింది ఏంటి?తన కులానికే చెందిన స్నేహితులతో కలిసి శివాజీ ఎలాంటి దారుణానికి ఒడిగట్టాడు అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

ఇది వరకు తెలుగు సినిమా నుంచి కుల వివక్ష నేపథ్యంలో పలు సినిమాలు వచ్చాయి కానీ ఈ దండోరా లో మాత్రం పూర్తిగా కొత్త కోణం కనిపిస్తుంది. ఇది వరకు చూడని ఒక కొత్త అంశాన్ని దర్శకుడు ఎంచుకోవడం విశేషం. దానిని కూడా అంతే ఆసక్తిగా తెరకెక్కించడం ఈ సినిమాలో బాగుంది. రెండు భిన్నమైన కులాల నడుమ వివక్ష, అణచివేతని చూపిస్తూనే మరో కొత్త కోణాన్ని చూపించడం ఇందులో మెప్పిస్తుంది.

అలాగే అగ్ర కులానికి చెందిన బాధితునిపై సీన్స్ తో మొదలైన స్టార్ట్ ఆడియెన్ ని లీనం అయ్యేలా చేస్తుంది. ఇలా కథనం ఒకింత ఆసక్తిగా సాగుతూ వెళుతుంది. ఇలా ఒక ఫ్లో కొనసాగుతూ హై టెన్షన్ కోర్ట్ డ్రామా నుంచి ఇంకో లెవెల్లోకి సినిమా వెళుతుంది. అలాగే క్లైమాక్స్ పోర్షన్ లో నందు, రాధ్య లపై సీక్వెన్స్ బాగుంది. అలాగే ఇచ్చిన ముగింపు కూడా సినిమాలో మెప్పిస్తుంది.

ఇక నటుడు శివాజీ కోసం మొదటిగా మాట్లాడుకోవాలి. ఇటీవల కోర్ట్ సినిమాలో కూడా ఇదే తరహా పాత్రలో కనిపించారు కానీ ఇందులో చేసిన రోల్ కూడా తన నుంచి మరో ఐకానిక్ నెగిటివ్ రోల్ ఇది అని చెప్పొచ్చు. తన మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ అలాగే డైలాగ్ డెలివరీ అద్భుతంగా పండాయి. అలాగే నటుడు రవికృష్ణ తన రోల్ లో బాగా చేసాడు. మెగాస్టార్ ఫ్యాన్ గా తన డాన్స్ యాంగిల్ కూడా చూపించాడు ఇందులో.

అలాగే మాణిక కూడా బాగా చేసింది. ఇంకా నందుకి కూడా ఈ సినిమాలో మంచి రోల్ దక్కిందని చెప్పొచ్చు. ఇక వీరితో పాటుగా మరో సర్ప్రైజ్ ప్యాక్ ఆ ఊరి సర్పంచ్ గా నటించిన నటుడు నవదీప్ అని చెప్పాలి. తన నుంచి ఈ రోల్ రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. తన నుంచి ఫన్ యాంగిల్ ఈ సినిమాలో మెప్పిస్తుంది. అలాగే బిందు మాధవి, మురళీధర్ గౌడ్ తదితరులు తమ పాత్రలకి న్యాయం చేకూర్చారు.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో పాయింట్ ఇంకా చాలా వరకు సన్నివేశాలు డీసెంట్ గానే ఉన్నాయి. కానీ కొన్ని చోట్ల మాత్రం కథనం ఇంకా బెటర్ గా ప్లాన్ చేసి ఉండాల్సింది. మెయిన్ గా ఫస్టాఫ్ లో కథనం కొంచెం అటు ఇటుగా అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్, ప్రస్తుతానికి చూపిస్తూ వచ్చే సన్నివేశాలు అంత క్లారిటీగా అనిపించవు.

అలాగే కొన్ని సీన్స్ సాగదీతగా అనిపిస్తాయి. ఇంకా సినిమాలో శివాజీ, బిందు మాధవి ట్రాక్ సినిమాలో బాగుంది కానీ వారి ట్రాక్ లో కెమిస్ట్రీలో కొంచెం క్లారిటీగా కనిపిస్తే బాగుండేది. అలాగే కొన్ని సీన్స్ మాత్రం ఆడియెన్స్ తమ ఊహాశక్తికి తగ్గట్టుగా తీసుకోవాల్సి ఉన్నట్టు అనిపిస్తాయి. ఇలాంటి వాటిలో దర్శకుడు కొద్దిగా కేర్ తీసుకోవాల్సి ఉంది.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. వింటేజ్ బ్యాక్ డ్రాప్ కి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న ప్రొడక్షన్ డిజైన్ నీట్ గా ఉంది. మార్క్ కే రాబిన్ సంగీతం బాగుంది. పాటలు, మెయిన్ గా నేపథ్య సంగీతం ఇందులో ఇంపాక్ట్ కలిగిస్తుంది. వెంకట్ శకమూరి ఇచ్చిన కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ కూడా పర్వాలేదు.

ఇక దర్శకుడు మురళి కాంత్ విషయానికి వస్తే.. తాను ఎంచుకున్న నేపథ్యం అందుకు తగ్గట్టుగా దాదాపు కథనాన్ని చాలా సహజంగా తాను నడిపించిన విధానం ఇందులో బాగుంది. ఇది వరకు కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ తన ఎంపిక ఇందులో కొత్తగా ఉంది. కొన్ని చోట్ల ఇంకొంచెం జాగ్రత్త వహించి ఉంటే సినిమా ఇంకా బెటర్ గా అనిపించి ఉండేది. అయినప్పటికీ తన వర్క్ ఈ సినిమాలో బావుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే ‘దండోరా’ కులాల నేపథ్యంలో ఇది వరకు వచ్చిన మిగతా సినిమాలలా కాకుండా ఇదో కొత్త కోణం. పైగా దీనిని దర్శకుడు నడిపించిన విధానం నటీనటుల సాలిడ్ పెర్ఫామెన్స్ లతో ఇంప్రెస్ చేస్తుంది. కొన్ని సీన్స్ ఇంకా బెటర్ గా చేయాల్సి ఉంది. ఇవి పక్కన పెడితే ఈ హానెస్ట్ అటెంప్ట్ ఆడియెన్స్ ని మెప్పిస్తుంది.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

Exit mobile version