‘ది ప్యారడైజ్’.. జడల్ గాని వేట హాఫ్ మిలియన్ కి చేరుకుంది!

నాచురల్ స్టార్ నాని హీరోగా కయాదు లోహర్ హీరోయిన్ గా యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న అవైటెడ్ భారీ చిత్రమే “ది ప్యారడైజ్”. టాలీవుడ్ నుంచి ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ లలో ఇది కూడా ఒకటి. ఇక ఎన్నో అవాంతరాలు నడుమ ఎట్టకేలకి థియేటర్స్ లో ఈ చిత్రాన్ని మేకర్స్ విడుదలకి తీసుకొస్తున్నారు.

ఇదిలా ఉండగా నానికి స్ట్రాంగ్ మార్కెట్ అయినటువంటి యూఎస్, నార్త్ అమెరికాలో ఈ సినిమా హవా కొనసాగిస్తుంది. లేటెస్ట్ గా ఈ సినిమా అక్కడ ప్రీసేల్స్ లో హాఫ్ మిలియన్ డాలర్ మార్క్ ని క్రాస్ చేసి సెన్సేషన్ సెట్ చేసింది. దీనితో రిలీజ్ నాటికి ఈజీగా 1 మిలియన్ డాలర్స్ మార్క్ ని ఈ చిత్రం క్రాస్ చేస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఎస్ ఎల్ వి సినిమాస్ నిర్మాణం వహిస్తున్న ఈ సినిమా గ్రాండ్ గా ఈ సెప్టెంబర్ 24న పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.

Exit mobile version