ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన స్ట్రేంజర్ థింగ్స్ 5 మిగతా ఎపిసోడ్స్!

Stranger-Things-S5

వరల్డ్ వైడ్ ఓటీటీ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ వెబ్ సిరీస్ ఏదన్నా ఉంది అంటే అది స్ట్రేంజర్ థింగ్స్ అనే చెప్పాలి. దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న ఈ సిరీస్ నుంచి 5వ సీజన్ ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది. అయితే మిగతా సీజన్స్ లా కాకుండా ఈ సీజన్ ని వాల్యూమ్స్ గా విడుదల చేస్తున్నారు.

ఇలా గత నెల మొదటి వాల్యూమ్ గా 4 ఎపిసోడ్స్ ని విడుదల చేయగా ఇప్పుడు రెండో వాల్యూమ్ గా 3 ఎపిసోడ్స్ ని నెట్ ఫ్లిక్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనితో ఈ ఎపిసోడ్స్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులు ఇప్పుడు నుంచి చూడొచ్చు. ఇవాళ ఉదయం 6 గంటల 30 నిమిషాలు నుంచి ఇండియాలో ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. అలాగే రీజనల్ భాషల్లో కూడా అందుబాటులో ఉంది.

Exit mobile version