మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో రామ్ పోతినేని కూడా ఒకరు. మరి రామ్ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు మహేష్ బాబు పి తెరకెక్కించిన ఎమోషనల్ ఫ్యాన్ బయోపిక్ చిత్రమే ‘ఆంధ్ర కింగ్ తాలూకా'(Andhra King Thaluka). కన్నడ స్టార్ నటుడు రియల్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటించిన ఈ సినిమా థియేటర్స్ లో డీసెంట్ గానే పెర్ఫామ్ చేసింది. ఇక రీసెంట్ గానే ఈ సినిమా ఓటిటిలో కూడా వచ్చింది.
దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఇటీవల పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వచ్చింది. మరి ఇక్కడ వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఇండియన్ ట్రెండ్ లిస్ట్ ని టేకోవర్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా ఇండియా వైడ్ గా నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుండడం విశేషం. సో ఓటిటిలోకి వచ్చాక కూడా ఈ సినిమాకి మంచి స్పందన లభించింది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి వివేక్ – మెర్విన్ లు సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.
