పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘స్పిరిట్’ (Spirit) కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ‘స్పిరిట్’ (Spirit) చిత్రంతో ఈ కాంబో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసాన్ని సృష్టిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది.
అయితే, ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ మరికొద్ది గంటల్లో వస్తుందని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజాగా ట్వీట్ చేశారు. దీంతో కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే సినిమాపై మరింత హైప్ పెంచేస్తున్నారు మేకర్స్. ఈ పోస్టర్ ఎలా ఉండబోతుందా.. ఇందులో ప్రభాస్‌ని సందీప్ రెడ్డి ఎలా చూపిస్తాడా..? అని అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
కాగా, ఈ సినిమాలో ప్రభాస్ రూత్‌లెస్ కాప్ పాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే, ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డిసెంబర్ 31న అర్థరాత్రి సమయంలో రిలీజ్ చేసి ప్రేక్షకులకు, అభిమానులకు సాలిడ్ న్యూ ఇయర్ ట్రీట్ ఇచ్చేందుకు స్పిరిట్ టీమ్ రెడీ అవుతుంది.
People…
A few hours more for SPIRIT – First Poster.#Spirit— Sandeep Reddy Vanga (@imvangasandeep) December 31, 2025
