వార్ జోన్‌లో దూసుకుపోనున్న ‘టైసన్ నాయుడు’.. అదిరిపోయిన కొత్త పోస్టర్..!

Tyson Naidu

టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న చిత్రాల్లో ‘టైసన్ నాయుడు’ కూడా ఒకటి. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక నేడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఆయన యుద్ధానికి సిద్ధమైన రౌడీ లుక్‌లో కనిపించాడు. కళ్లలో కసి, గడ్డం, ముఖంపై గాయాల గుర్తులు.. అన్నీ కలసి పోరాటాలతో కఠినుడిగా మారిన పాత్రను చూపిస్తున్నాయి.

భారీ ఆయుధం పట్టుకుని, చుట్టూ పేలుళ్ల మధ్య దూసుకెళ్తున్న ఆయన లుక్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. ఈ సినిమాలో సాయి శ్రీనివాస్ బాక్సింగ్‌ను ఇష్టపడే పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్‌కు అతడు పెద్ద అభిమానిగా చూపించనున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది.

Exit mobile version