ఈ సంక్రాంతి బరిలో రిలీజ్ కి వస్తున్న పలు అవైటెడ్ చిత్రాల్లో తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ హీరోగా దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “జన నాయగన్” (Jana Nayagan). విజయ్ కెరీర్ లో ఆఖరి సినిమాగా వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఈ జనవరి 9న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా నటసింహం బాలయ్య సూపర్ హిట్ చిత్రం భగవంత్ కేసరి కి రీమేక్ అని ఇప్పుడు అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చేసింది.
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ ట్విస్ట్ వైరల్ అవుతుంది. ఇంకా జన నాయగన్ (Jana Nayagan) థియేటర్స్ లో పడకుండానే అప్పుడే ఓటిటి రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్నట్టు వినిపిస్తుంది. ఈ సినిమా తాలూకా డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి అందులో ఈ సినిమా ఫిబ్రవరి 6 నుంచే అందుబాటులోకి వచ్చేస్తుందట. అంటే ఈ సినిమా నెల తిరక్కుండానే ఓటిటిలో ఉంటుంది అని చెప్పొచ్చు. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.
