సుధీర్ అట్టావర్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కొరగజ్జ’ ఆడియో ప్రీమియర్ వేడుక న్యూ ఇయర్ సందర్భంగా ఘనంగా జరిగింది. హోటల్ హాలిడే ఇన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో సినిమా పాటలను 300కి పైగా ఆడియో ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేశారు. ఈ వేడుకలో భాగంగా చిత్ర యూనిట్ ఒక భారీ ‘రీల్స్ కాంటెస్ట్’ను ప్రకటించింది. ‘కొరగజ్జ’ పాటలతో క్రియేటివ్ రీల్స్ చేసే విజేతలకు ఏకంగా ఒక కోటి రూపాయల విలువైన బహుమతులు అందజేయనున్నారు.
ఈ రీల్స్ పోటీలో జిల్లా మరియు రాష్ట్ర స్థాయిల్లో విజేతలను ఎంపిక చేస్తారు. ప్రతి వారం జిల్లా స్థాయిలో ప్రత్యేక బహుమతులు ఉంటాయని, ఎక్కువ వ్యూస్ మరియు లైక్స్ సాధించిన వారికి ప్రాధాన్యత ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. అయితే, అసభ్యకరమైన రీల్స్ చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ చిత్రంలో శ్రేయ ఘోషల్, అర్మాన్ మాలిక్ పాడిన ‘గాలి గంధ’ అనే AI పవర్డ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
త్రివిక్రమ సినిమాస్ & సక్సెస్ ఫిల్మ్స్ బ్యానర్‌పై త్రివిక్రమ సపల్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో కబీర్ బేడి, సందీప్ సోపార్కర్, గణేష్ ఆచార్య, భవ్య, శృతి వంటి ప్రముఖ తారాగణం నటిస్తున్నారు. సీనియర్ నటి భవ్య చేసిన యక్షగాన ప్రదర్శన వేడుకలో హైలైట్‌గా నిలిచింది. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకులను అలరించనుంది.
రీల్స్ ట్యాగ్ చేయాల్సిన అకౌంట్స్:
@sudheer.attavar
@vidyabejai
@trivikramsapalya
