ఈ సంక్రాంతి కానుకగా మన దక్షిణాది సినిమా నుంచి పలు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆల్రెడీ లాక్ అయ్యి ఉన్న సంగతి తెలిసిందే. మరి రేపు జనవరి 9న రెబల్ స్టార్ ప్రభాస్, దళపతి విజయ్ ల సినిమాలు రావాల్సి ఉండగా ఈ చిత్రాల్లో విజయ్ నటించిన ‘జన నాయగన్'(Jana Nayagan) కి ఊహించని విధంగా చివరి నిమిషంలో చిక్కులు ఎదురయ్యాయి. దీనితో మేకర్స్ ఈ సినిమాని వాయిదా వేసేసారు.
కానీ కొత్త డేట్ ఏంటి ఎప్పుడు అనేది ఇంకా రివీల్ కాలేదు. అయితే ఈ సమయంలో టాలెంటెడ్ హీరో కార్తీ నటించిన చిత్రం ‘వా వాథియర్’, తెలుగులో ‘అన్నగారు వస్తారు’ లైన్ లోకి రావాలని చూస్తున్నట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ జన నాయకుడు ఈ సంక్రాంతి బరిలో రాదు అని మాత్రం కన్ఫర్మ్ అయితే ఈ సీజన్ లో కార్తీ సినిమా వచ్చేస్తుందట. మరి ఇప్పుడు జన నాయగన్ కి వచ్చే తీర్పు పట్ల అంతా ఆసక్తి నెలకొంది. సో ఈ సంక్రాంతికి కోలీవుడ్ నుంచి ఏ సినిమా వస్తుందో చూడాలి.
