రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న తరుణం వచ్చేసింది. ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ది రాజా సాబ్’(The Raja Saab)కు సంబంధించిన నైజాం రిలీజ్‌పై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. ఈ నెల 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయిన ‘ది రాజా సాబ్’ చిత్రానికి సంబంధించి టికెట్ రేట్ల గురించి మేకర్స్ చివరి నిమిషం వరకు వెయిట్ చేశారు.
అయితే, టికెట్ రేట్ల పెంపుకు తెలంగాణ సర్కార్ అనుమతులు ఇవ్వనట్లు తెలుస్తోంది. దీంతో సాధారణ టికెట్ రేట్లతో ఆన్‌లైన్ బుకింగ్స్ చాలా ఆలస్యంగా ఓపెన్ అయ్యాయి. అయితే, సాధారణ టికెట్ రేట్లతోనే లేట్ నైట్ ప్రీమియర్స్‌కు బుకింగ్స్ ఓపెన్ కావడంతో ఫ్యాన్స్ కొంతమేర సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఏదేమైనా ఇతర రాష్ట్రాల్లో సినిమా ఇప్పటికే ప్రీమియర్ షోలు పడటంతో నైజాం ఏరియాలోని ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే థియేటర్ల వద్ద భారీగా చేరిన అభిమానులు సినిమా చూసేందుకు తహతహలాడుతున్నారు.
