నితిన్ కి నాని లక్ కలిసొస్తుందా.. రుక్మిణి తో హిట్ దక్కేనా..?

టాలీవుడ్ లో మరో ఆసక్తికరమైన కాంబినేషన్ సెట్ అయింది. న్యాచురల్ స్టార్ నాని నిర్మాణంలో నితిన్ హీరోగా ‘అలియాస్ రుక్మిణి’ అనే చిత్రం అఫీషియల్‌గా పట్టాలెక్కింది. ‘దండోరా’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించకపోయినా, విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు మురళీకాంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. నాని – మురళీకాంత్ కాంబోలో సినిమా వస్తుందని అందరికీ తెలిసినప్పటికీ, అందులో నితిన్ హీరో అనే విషయాన్ని సడన్‌గా క్లాప్ కొట్టి, గ్లింప్స్‌తో సహా రివీల్ చేసి చిత్రబృందం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ గ్లింప్స్ లో నితిన్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోందో కూడా క్లారిటీ ఇచ్చారు.

​సీనియారిటీలో నితిన్ ముందే ఉన్నప్పటికీ, హీరోగా మరియు నిర్మాతగా నాని మంచి సక్సెస్ ట్రాక్‌తో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం వరుస ఫ్లాపులతో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న నితిన్‌కి, నాని బ్యానర్ లో సినిమా రావడం ఒక పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. నాని సినిమాలకు ఉండే స్పెషల్ క్రేజ్, ఆయన అందించే భారీ ప్రమోషన్లు నితిన్ కెరీర్‌కి బాగా ఉపయోగపడనున్నాయి. మంచి టీమ్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాతోనైనా నితిన్‌కి ఆశించిన విజయం దక్కుతుందో లేదో చూడాలి.

Exit mobile version