ఇళయ దళపతి విజయ్ హీరోగా నటించిన ఆఖరి చిత్రమే ‘జన నాయగన్’ (Jana Nayagan). మన టాలీవుడ్ చిత్రం “భగవంత్ కేసరి” కి రీమేక్ గా తెరకెక్కించిన ఈ సినిమా గ్రాండ్ గా రేపు జనవరి 9న విడుదల కావాల్సి ఉంది కానీ ఊహించని విధంగా ఈ సినిమా విడుదల ఆగిపోయింది. అయితే ఈ సినిమా ఆగడానికి మెయిన్ గా సెన్సార్ పూర్తి కాకపోవడమే అని తెలిసిందే. కంటెంట్ అంతా సిద్ధంగా ఉంది కానీ సెన్సార్ లో జాప్యం నెలకొనడంతో సస్పెన్స్ గా మారింది ఈ సినిమా తాలూకా రిలీజ్.
ఊహించని సంఖ్యలో కట్స్ చెప్పిన సెన్సార్ యూనిట్?
ఈ సినిమాని భగవంత్ కేసరికి పొలిటికల్ టచ్ ఇచ్చి విజయ్ పొలిటికల్ యాంగిల్ లో మార్చుకున్నారనే టాక్ ఉంది. గతంలో కూడా విజయ్, ప్రభుత్వాలని ప్రశ్నించిన సీన్స్ ని పెట్టడం వివాదాలకు దారి తీసింది. కానీ ఆ సీన్స్ ని కూడా సెన్సార్ వారు తర్వాత తొలగించారు. అయితే ఈసారి డోస్ చాలా ఎక్కువ ఉందట. ఊహించని సంఖ్యలో డైలాగ్స్ ఇందులో ఉన్నాయట. దీనితో ఇవన్నీ సవరించాల్సి ఉంది.
ఓటీటీకి అసలు ప్లాన్?
థియేటర్స్ లో రిలీజ్ కి అభ్యంతరం చెబితే ఓటీటీకి మాత్రం రా కంటెంట్ వదులుకునే వెసులుబాటు మన దగ్గర ఉంది. అలా థియేటర్స్ లో ఒకలా ఓటిటిలో కొన్ని మార్పులు చేర్పులతో వచ్చిన సినిమాలు కూడా లేకపోలేవు, మన దగ్గర ఓటీటీలో ఎలాంటి హద్దులు లేవు. సో ఆ డైలాగ్స్ అన్నీ ఓటిటి రిలీజ్ కి పెట్టుకుంటారా లేదా అనేది మాత్రం వేచి చూడాలి.
