ఓల్డ్ లుక్ ప్రభాస్ మిస్సింగ్.. కారణం, సీన్స్ ఎప్పుడు నుంచి అనేది క్లారిటీ!

raja-saab-Movie

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఇప్పుడు రాజా సాబ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎంతో కాలం నుంచి మిస్ అవుతున్న వింటేజ్ ప్రభాస్ ని మళ్ళీ ఇప్పుడు థియేటర్స్ లో మారుతీ ప్రెజెంట్ చేయడంతో విట్నెస్ చేసి తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో సినిమాపై వచ్చిన కొన్ని కామెంట్స్ ని మేకర్స్ కూడా దృష్టిలో తీసుకొని వెంటనే రెస్పాన్స్ అందించడం జరిగింది.

ఇలా డే 1 ఇంకా ప్రీమియర్స్ కూడా చూసిన అభిమానుల్లో ఓ కంప్లైంట్ ని ఫైనల్ గా మేకర్స్ రెక్టిఫై చేసినట్టు తెలిపారు. థియేటర్స్ లో ప్రభాస్ ఓల్డ్ లుక్ అండ్ ఫైట్ సీక్వెన్స్ లేకపోవడం అభిమానులకి తీవ్ర నిరాశ కలిగించింది. దీనితో అభిమానులు పూర్తి స్థాయిలో శాటిస్ఫై అవ్వలేకపోయారని అర్ధం అయ్యినట్టు దర్శకుడు తెలిపారు.

ఇక నిర్మాత టీజీ విశ్వప్రసాద్ అసలు విషయాన్ని రివీల్ చేశారు. సెర్వర్ సమస్యలు మూలాన థియేటర్స్ లో ఆ సీక్వెన్స్ యాడ్ చేయడం కుదరలేదు అని ఇప్పుడు నుంచి యాడ్ చేస్తున్నట్టు తెలిపారు. అలాగే మారుతి మాట ప్రకారం అయితే ఈ జనవరి 10 సాయంత్రం షోస్ నుంచే యాడ్ చేస్తున్నట్టు తెలిపారు. సో ఇది మాత్రం ఫ్యాన్స్ కి ట్రీట్ అనే చెప్పొచ్చు.

Exit mobile version