బొల్లినేని కృష్ణయ్య మహోన్నత ధార్మిక సేవకు ప్రశంసలు !!
అమరావతి : జనవరి : 11
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలు మంచి వాక్యనిర్మాణాల మధ్య ముద్రించబడిన ఒక అద్భుత మంత్రమయ గ్రంధం విజయవాడ , అమరావతి ఆలయాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో గత ఆరు నెలలుగా హల్ చల్ చేస్తోంది. నాలుగు వందల పేజీలు, నాలుగు రకాల అద్భుత ముఖ చిత్రాలు , నాలుగు వేదాల సాక్షిగా … అమోఘంగా ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ తీర్చిదిద్దిన ఈ శోభాయమాన వైదిక విలువల రచనా సంకలనం పేరు ‘ శ్రీమాలిక ‘. ఈ మహామంత్ర వ్యాఖ్యాన దివ్య గ్రంధం పురాణపండ శ్రీనివాస్ శ్రీమాలిక ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ఆలయాల్లో , ఉపాసకుల్లో , భక్త పాఠకుల్లో హాట్ టాపిక్ గా మారడం ఆశ్చర్యకరంగా దర్శనమిస్తోంది.
తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో , తెలుగుదేశం సీనియర్ నేతల గృహాల్లో ఇటీవల దర్శనమిస్తున్న ఈ శ్రీమాలిక గ్రంధం ఎక్కువ తెలుగుదేశం శ్రేణులకు అందడానికి ప్రధాన కారణం కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ , ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు , ప్రముఖ పారిశ్రామికవేత్త బొల్లినేని కృష్ణయ్య నిస్వార్ధ భక్తి సేవాతత్పరత కారణం కావడం గమనార్హం.
కల్మషం లేని పుణ్య ప్రవర్తనతో సంచరించే విశాల హృదయం గల స్పాంటేనియస్ స్పీకర్ గా తెలుగు రాష్ట్రాల్లో విశేష ఖ్యాతి పొందిన శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు , ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ని ఈ శ్రీమాలిక గ్రంధానికి రచనా సంకలన కర్తగా ఎంచుకోవడంతోనే బుక్ సూపర్ హిట్ అయ్యిందని బెజవాడ ఇంద్రకీలాద్రి పై కొలువుతీరిన అమ్మవారి చలువతో… శ్రీ దుర్గా మల్లేశ్వరశ్వర స్వామి దేవస్థానం జాయింట్ కమీషనర్ శీనా నాయక్ బహిరంగంగానే బొల్లినేని కృష్ణయ్యపై ప్రశంసలు వర్షించారు. రెండు రోజుల వేద పండిత సదస్సులో ప్రత్యేకంగా వందల కొలది పండితులకు శీనా నాయక్ స్వయంగా ఈ శ్రీమాలిక ను వైదిక జ్ఞాపికగా పంచడం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.
తన అద్భుత శైలిలో ధగ ధగలు , నిగ నిగలు , తళ తళలు పవిత్రంగా చల్లని కాంతిలా రమణీయ శైలిలో ఆవిష్కరించే పురాణపండ శ్రీనివాస్ ఈ శ్రీమాలిక లో రచించిన లక్ష్మీ నారసింహుని ఆవిర్భావ ఘట్టానికి మంత్ర వేత్తలు, వేద వేత్తలు ఘన నీరాజనాలు సమర్పిస్తున్నారు.
ఎన్నో సాంఘిక సాంస్కృతిక ధార్మిక కార్యక్రమాలను జాతీయ స్థాయిలో గత ఐదారు దశాబ్దాలుగా ఘనంగా నిర్వహించి లక్షలమంది చే ప్రశంసలు పొందిన బొల్లినేని కృష్ణయ్య సమర్పణలో అమరావతి, విజయవాడ, మంగళగిరి లలో ఇంచుమించుగా ఎన్నో ఆధికారిక కార్యాలయాల్లో ఉద్యోగులకు, అధికారులకు తెలుగుదేశం శ్రేణులు పంచడం ఎంతోమందికి ఆనందాన్ని కలిగించింది. అలాగే గత దసరా ఉత్సవాల్లో ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ ఉత్సవాలకు సౌభాగ్య పేరిట ఒక అసాధారణ గ్రంధాన్ని పురాణపండ చేతనే రూపొందింపే చేసి సుమారు లక్ష ప్రతులను ఆనాటి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.ఎస్. రామారావుకు అందజేసినప్పుడు ఆయన ఆశ్చర్యపోయి … ఇలాంటి మంత్రభరిత అద్భుత గ్రంథ సేవ చేసిన బొల్లినేని కృష్ణయ్యను స్వయంగా అమ్మవారి సమక్షంలో ఆలయ సంప్రదాయానుసారం సత్కరించడం విశేషం. ఈ సందర్భంలో పురాణపండ శ్రీనివాస్ అద్వితీయ ప్రతిభను , ప్రజ్ఞను , నిస్వార్ధ సేవాతత్పరతను రామారావు కృష్ణయ్యతో ప్రస్తావించడాన్ని ప్రత్యేకంగా పేర్కొనాలి.
అంతేకాదు … మంగళగిరి జనసేన కార్యాలయంలో సైతం వందలకొలది జనసేన నేతలకు ఈ బుక్ ని పార్టీ శ్రేణులే పంచడం , వాళ్ళెంతో సంతోషించడం గమనార్హం. జయం .. జయం , యుగే … యుగే , శరణు … శరణు , స్మరామి .. స్మరామి , శంకర … శంకర , అమ్మణ్ణి , అదివో అల్లదివో, నేనున్నాను, శ్రీపూర్ణిమ , శ్రీమాలిక , మహా సౌందర్యం , మహామంత్రస్య, పచ్చ కర్పూరం వంటి సుమారు యాభై అమోఘ ఆర్ష వైభ గ్రంధాలను రచనా సంకలన అమృతకలశాలుగా అందించిన పురాణపండ శ్రీనివాస్ కు వేల వేల సంఖ్యలో ఫాన్స్ ఫాలోయింగ్ ఉందనేది నిర్వివాదాంశం. తన జీవన యాత్రలో అడుగడుగునా సవాళ్లెదుర్కొన్న పురాణపండ శ్రీనివాస్ దైవబలంతో , సృజన ప్రతిభతో ఎలా అమోఘ వైభవాల్ని ఆవిష్కరిస్తున్నారో మన కన్నులముందే కనిపిస్తున్న ఆశ్చర్యకర సన్నివేశాలు మనకూ ఎంతో ఆశ్చర్యాన్ని కలుగచేస్తాయి.
శ్రీనివాస్ మాట్లాడుతున్నప్పుడు పదం కదం త్రొక్కిందంటే ఆడియన్స్ కి వొళ్ళు అనుభూతితో కూడిన ఒక జలదరింపు , మరొక పరిమళింపు ఖచ్చితంగా చేరువవుతాయని జ్ఞానపీఠ మహాకవి ఆచార్య సి.నారాయణరెడ్డి పదేళ్లనాడు రవీంద్రభారతిలో అన్నమాటలు ఈనాటికీ మేధో సమాజానికి చెవులముందు ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయన్నది సత్యం.
ఇటీవల బొల్లినేని కృష్ణయ్య ఒక ప్రైవేట్ వేడుకలో మార్గదర్శి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ బృందానికి స్వయంగా జూబిలీహిల్స్ లో శ్రీమాలిక అందించడం ఒక ఎత్తయితే … శైలజాకిరణ్ ఈ బుక్ ని ప్రశాంతంగా పరిశీలించి తన పూజా పీఠంలో నిత్య పారాయణ గ్రంధంగా అలంకరింప చేసుకున్నట్లు మార్గదర్శి వర్గాలు వెల్లడించాయి. బొల్లినేని కృష్ణయ్య చేస్తున్న సేవకు గతంలోనే నారా చంద్రబాబు నాయుడి సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి కుప్పం పర్యటనలో ఒక ఆలయంలో ప్రశంసలు వర్షించారు.
