‘ఎల్లమ్మ’ అనౌన్స్‌మెంట్‌కు టైమ్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

Venu Yeldandi

‘బలగం’ సినిమాతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు వేణు యెల్దండి. ఈ సినిమాతో వేణు తొలి ప్రయత్నంలోనే భారీ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఆయన తన నెక్స్ట్ చిత్రాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే తన నెక్స్ట్ చిత్రం ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో ఉండబోతుందని ఆయన వెల్లడించారు.

ఇక ఇప్పుడు ఈ సినిమాను అధికారికంగా ప్రకటించేందుకు డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చేశారు. #SVC61 వ ప్రాజెక్ట్‌గా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ సంక్రాంతి కానుకగా జనవరి 15న సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు వేణు తాజాగా ఓ వీడియో ద్వారా వెల్లడించారు.

కాగా, ఈ సినిమాకు ఎల్లమ్మ అనే టైటిల్ ఉండబోతున్నట్లు దర్శకుడు వేణు, నిర్మాత దిల్ రాజు పలు వేదికలపై ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించనుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version