సౌత్ స్టార్ హీరోయిన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ లో నాచురల్ బ్యూటీ సాయి పల్లవి కూడా ఒకరు. మరి సాయి పల్లవి హీరోయిన్ గా ఇప్పుడు పలు చిత్రాలు పాన్ ఇండియా లెవెల్లో చేస్తుండగా ఆమె హిందీలో కూడా రెండు సినిమాలు చేస్తుంది. అయితే హిందీలో ఆమె సినిమా అంటే మొదట భారీ చిత్రం ‘రామాయణ’నే గుర్తొస్తుంది.
కానీ ఇది కాకుండా ముందుగా చేసిన సినిమానే ‘ఏక్ దిన్'(Ek Din). స్టార్ హీరో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాపై మేకర్స్ ఫైనల్ గా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మే 1 నుంచి ప్రదర్శితం కానుండగా రేపు జనవరి 16న దీని తాలూకా టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ అనౌన్సమెంట్ టీజర్ పై వదిలిన పోస్టర్ కూడా ఫ్యాన్స్ లో మంచి ఆసక్తి రేపింది. ఈ చిత్రాన్ని సునీల్ పాండే దర్శకత్వం వహిస్తుండగా అమీర్ ఖాన్ నిర్మాణం వహిస్తున్నారు.
