కోలీవుడ్ టాలెంటెడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన సినిమాలు గత ఏడాది చాలానే వచ్చాయి. తెలుగు, తమిళ్ ఇంకా హిందీ లో కూడా తన సినిమాలు రాగా ఈ సినిమాల్లో లేటెస్ట్ గా తన హిందీ హిట్ చిత్రం “తేరే ఇష్క్ మే” (Tere Ishk Mein)ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కి సిద్దం అయ్యింది. మరి ఈ సినిమాని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా వారు రిలీజ్ డేట్ ఇచ్చేసారు.
దీనితో ఈ సినిమా ఈ జనవరి 23న రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. అయితే ఈ సినిమా తెలుగులో “అమర కావ్యం” గా విడుదల అయ్యింది కానీ పెద్దగా తెలియలేదు. ప్రస్తుతం అయితే డబ్బింగ్ వెర్షన్ కూడా ఈ 23న వస్తాయా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించగా కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. అలాగే రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా హిందీలో 150 కోట్లకి పైగా వసూళ్లు అందుకుంది.
