పెద్ది పాత్రపై రామ్ చరణ్ క్రేజీ కామెంట్స్

Peddi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’(Peddi) ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా సినిమాపై అన్ని వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ సాంగ్ ‘చికిరి చికిరి’ మ్యూజిక్ చార్ట్‌లను ఏలుతూ, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఇక తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ మరోసారి ఈ సినిమా 2026 మార్చి 27న థియేటర్లలో విడుదల కానుందని కన్ఫర్మ్ చేశాడు. అంతేకాదు, తన సినీ ప్రయాణంలో ఇప్పటివరకు పోషించిన పాత్రలన్నింటిలోనూ పెద్ది పాత్రనే అత్యంత ఆసక్తికరమైనదిగా పేర్కొనడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version