దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ మనవడు, ఘట్టమనేని రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా రాబోతున్న సినిమా ‘శ్రీనివాస మంగాపురం’. . తాజాగా ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ కోసం అజయ్ భూపతి కసరత్తులు చేస్తున్నాడు. వచ్చే నెల మొదటి వారం నుంచి జరగనున్న ఈ షెడ్యూల్ లో జయకృష్ణ పై యాక్షన్ సీన్స్ తో పాటు ఓ సాంగ్ ను కూడా షూట్ చేస్తారని తెలుస్తోంది. ఈ సాంగ్ లో జయకృష్ణ క్యారెక్టర్ ఆర్క్ ను ఎస్టాబ్లిష్ చేస్తారట.
కాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఇప్పటికే కీలక షెడ్యూల్ షూటింగ్ పూర్తయ్యింది. అశ్వినీ దత్ సమర్పణలో, పి. కిరణ్ నిర్మాణంలో ‘చందమామ కథలు’ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. కాగా తిరుపతి నేపథ్యంలో హిందూ పుణ్యక్షేత్రం తిరుమల వెంకటేశ్వర ఆలయం చుట్టూ ఈ కథ సాగుతుందని తెలుస్తోంది. విష్ణువు స్వయంభుగా అవతరించిన ఈ క్షేత్రంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ కథా నేపథ్యం సాగుతుందని.. ఈ సినిమా మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది.
