‘సలార్ 2’ కి రంగం సిద్దమైందా? ఆరోజున బిగ్ అనౌన్సమెంట్?

Salaar 2

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి పలు భారీ సీక్వెల్ సినిమాలు రావాల్సి ఉంది. మరి వాటిలో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సీక్వెల్ చిత్రం “సలార్ 2” (Salaar 2) కూడా ఒకటి. దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేయనున్న ఈ సినిమా ఎప్పుడో రావాల్సి ఉంది కానీ అలా ఆలస్యం అయ్యింది. ఇక పార్ట్ 2 కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఫైనల్ గా బిగ్ ట్రీట్ రాబోతున్నట్టు కొన్ని రూమర్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

సలార్ 2 (Salaar 2) స్టార్ట్ కి మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నారట. ఇక ఈ సినిమా స్టార్ట్ పై ఈ జనవరిలోనే అప్డేట్ ఉంటుంది అని లేటెస్ట్ టాక్ మొదలైంది. దీని ప్రకారం ఈ జనవరి 25న అలా అనౌన్సమెంట్ ఉంటుంది అని వినిపిస్తుంది. ఆల్రెడీ హోంబళే వారు ప్రభాస్ తో మూడు సినిమాలు లాక్ చేసుకున్నారు. అలాగే ఈ 2026 లో ఒక సినిమా ఉంటుంది అని ప్రామిస్ చేశారు. మరి అన్నీ సెట్టయ్యి సలార్ 2 (Salaar 2) ఈ ఏడాదిలోనే వస్తుందో ఏమో చూడాలి. ఆల్రెడీ ఈ సినిమా షూట్ కూడా కొంతమేర పూర్తయ్యింది.

Exit mobile version