ఓటీటీ వేదిక : నెట్‌ఫ్లిక్స్
ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ : మార్చి 12, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : ప్రియాంకా మోహన్, పార్క్ హే-జిన్, రిషికాంత్, జే-హ్యూన్ జాంగ్, కిమ్ సో-రి, హా రామ్, నో హో-జిన్ తదితరులు.
దర్శకత్వం : రా కార్తీక్
నిర్మాత : శ్రీనిధి సాగర్
సంగీతం : హేషామ్ అబ్దుల్ వహాబ్
ఛాయాగ్రహణం : ప్రసన్న ఎస్. కుమార్
కూర్పు : ఆంథోనీ
సంబంధిత లింక్స్ : ట్రైలర్
యువ హీరోయిన్ ప్రియాంకా మోహన్ ప్రధాన పాత్రలో నటించిన ఇండో-కొరియన్ రొమాంటిక్ ఫాంటసీ చిత్రమే ‘మేడ్ ఇన్ కొరియా’ (Made in Korea). దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం నేడు డైరెక్ట్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. సౌత్ కొరియన్ స్టార్ పార్క్ హే-జిన్ హీరోగా నటించిన ఈ క్రాస్-కల్చరల్ ప్రేమకథ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Made in Korea కథ:
ఒక సాధారణ మధ్యతరగతికి చెందిన భారతీయ అమ్మాయి (ప్రియాంకా మోహన్) అనుకోకుండా ఓ పని మీద సౌత్ కొరియా వెళ్లాల్సి వస్తుంది. భాష తెలియని ఆ కొత్త దేశంలో ఆమెకు ఎదురైన సవాళ్లు ఏంటి? ఆ క్రమంలో లోకల్ కొరియన్ అబ్బాయి (పార్క్ హే-జిన్) తో ఆమెకు ఎలా పరిచయం ఏర్పడింది? ఇద్దరి మధ్య పరిచయం ఎటు వైపుగా వెళ్ళింది? దానికి ముగింపు ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ హైలైట్ ప్రియాంకా మోహన్ అనే చెప్పాలి. తన సహజమైన నటనతో, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇండియన్ కల్చర్‌కు, కొరియన్ లైఫ్‌స్టైల్‌కు మధ్య ఉన్న తేడాలను దర్శకుడు చాలా ఫన్నీగా తెరపైకి తీసుకొచ్చారు.
హీరో పార్క్ హే-జిన్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ముఖ్యంగా వీరిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఇందులో చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మొదటి సగంలో వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి. కే-డ్రామా (K-Drama) ఫ్యాన్స్ కోరుకునే స్వచ్ఛమైన ప్రేమ, ఫాంటసీ అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.
మైనస్ పాయింట్స్:
సినిమా కథలో ఆశించిన స్థాయిలో ట్విస్టులు కనిపించవు. చాలా వరకు సీన్స్ మనం ముందే ఊహించేలా సాగుతాయి. సెకండాఫ్‌లో ఎమోషనల్ కనెక్ట్ ఇంకాస్త బలంగా రాసుకుంటే బాగుండేది. అక్కడక్కడా కథనం నెమ్మదించడం వల్ల కాస్త బోర్ కొడుతుంది. కల్చరల్ గ్యాప్‌ను ఫన్నీగా చూపించే క్రమంలో కొన్ని చోట్ల దర్శకుడు లాజిక్స్ మిస్ అయ్యినట్టు అనిపిస్తుంది.
సాంకేతిక విభాగం:
నెట్‌ఫ్లిక్స్ వారి నిర్మాణ విలువలు కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. క్వాలిటీ కంటెంట్ నే తీసుకొస్తారు, ఇది కూడా అలానే ఉంది. సౌత్ కొరియా వీధులను, అక్కడి ప్రకృతి అందాలను కెమెరామెన్ చాలా కలర్‌ఫుల్‌గా చూపించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ ఫీల్ గుడ్ కథకు ప్రాణం పోసింది. పాటలు వినసొంపుగా ఉన్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉండాల్సింది, సెకండాఫ్‌లో కొన్ని ట్రిమ్ చేస్తే బాగుండేది.
తీర్పు:
ఇక మొత్తంగా చెప్పాలంటే.. ‘మేడ్ ఇన్ కొరియా’ (Made in Korea) ఒక స్వీట్ అండ్ సింపుల్ రొమాంటిక్ డ్రామా. ప్రియాంకా మోహన్ నటన, ఇండో-కొరియన్ కల్చరల్ ఎలిమెంట్స్, లీడ్ పెయిర్ కెమిస్ట్రీ సినిమాకు ప్లస్ అయ్యాయి. కథ రొటీన్‌గా ఉన్నప్పటికీ.. కే-డ్రామాస్, ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ ఇష్టపడేవారికి ఈ వీకెండ్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో చూసేందుకు ఇదొక చక్కటి ట్రీట్ అందిస్తుంది.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team
