ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర భారీ హైప్ ని సొంతం చేసుకొని రిలీజ్ కి రాబోతున్న బిగ్గెస్ట్ సీక్వెల్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది బాలీవుడ్ బ్లాస్టింగ్ హిట్ సీక్వెల్ ధురంధర్ 2 (Dhurandhar 2) అనే చెప్పాలి. దర్శకుడు ఆదిత్య ధర్, హీరో రణ్వీర్ సింగ్ కాంబినేషన్ లో లాక్ అయ్యిన ఈ సినిమా మార్చ్ లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఆల్రెడీ పార్ట్ 1 హవానే ఇంకా ఆగలేదు. ఇక పార్ట్ 2 వస్తే దాని ప్రకంపనలు ఎలా ఉంటాయో అని ఆల్రెడీ టాక్ మొదలైంది.
A Shocking rumor on Dhurandhar 2 – ఆల్రెడీ భారీ హైప్ కొత్త రూమర్ తో ఊహించని లెవెల్ కి
ధురంధర్ 2 (Dhurandhar 2) పై ఆల్రెడీ భారీ హైప్ నెలకొంది. అలాంటిది ఇప్పుడొక మ్యాడ్ రూమర్ బాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా వినిపిస్తుంది. ఇదే కానీ నిజం అయితే మాత్రం ధురంధర్ 2 ధాటిని బాక్సాఫీస్ దగ్గర ఆపడం అసాధ్యమే అని చెప్పాలి.
Vicky Kaushal cameo in Dhurandhar 2 – ఆదిత్య ధర్ యూనివర్స్? ‘యురి’తో ‘ధురంధర్’ లింక్?
ఇదే దర్శకుడు ఆదిత్య ధర్ (Aditya Dhar) ఇదే బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన దేశ భక్తి చిత్రం ‘యురి’ (URI Movie) కొన్నేళ్ల కితం సంచలన విజయం నమోదు చేసింది. ఇది కూడా భారీ లాంగ్ రన్ ని అప్పుడు చూడగా ఇదే సినిమాలో నటించిన హీరో విక్కీ కౌశల్ ఇప్పుడు ధురంధర్ పార్ట్ 2 లో క్యామియోలో కనిపిస్తాడు అన్నట్టు కొత్త రూమర్ మొదలైంది.
తాను ఆ చిత్రంలో ఏదైతే రోల్ లో కనిపించాడో అదే ఆర్మీ ఆఫీసర్ గా ధురంధర్ 2 లో కనిపించనున్నాడట. పొరపాటున ఈ రూమర్ గాని నిజం అయితే మాత్రం నార్త్ లో ఈ సినిమాని ఆపడం దాదాపు అసాధ్యమే అనుకోవాలి. ఇప్పటికే పార్ట్ 1 ఊహించని లాంగ్ రన్ ని చూస్తుంది. ఇక ఇలాంటి లింక్ కూడా పెట్టి వదిలితే మాత్రం ఆడియెన్స్ ఈ సినిమాని నెత్తిన పెట్టుకుంటారు. మరి ఈ కొత్త రూమర్ లో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాలి.
