భారీ షెడ్యూల్ ను ముగించిన ఎన్టీఆర్ !

NTR-Neel

ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా (వర్కింగ్ టైటిల్ డ్రాగన్) పై లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. భారీ స్థాయిలో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుత షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. ఎక్కువగా నైట్ ఎఫెక్ట్ లో నైట్ న ఘాట్ చేశారు. సినిమాటోగ్రఫీ విభాగంలో పనిచేస్తున్న ప్రజ్వల్ గౌడ ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. తదుపరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది,

కాగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో యాక్షన్ అద్భుతంగా ఉంటుందట. పైగా ఈ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట. అందుకే, ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ నీల్ చాలా టైమ్ తీసుకున్నాడు. కాబట్టి, ఇప్పటి వరకూ ప్రశాంత్ నీల్ తీసిన అన్ని సినిమాల్లోకల్లా బెస్ట్ సినిమా ఇదే అవుతుందని అంచనాలు ఉన్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌లో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. అనిల్ కపూర్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఈ ఏడాది జూన్ 25న థియేటర్లలో విడుదల కానుంది.

Exit mobile version