తమిళ బిగ్గెస్ట్ స్టార్ హీరోస్ లో ఒకరైన దళపతి విజయ్ (Thalapathy Vijay) హీరోగా పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్ గా దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమానే జన నాయగన్(Jana Nayagan). అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న విజయ్ ఆఖరి చిత్రం ఇది. అయితే సెన్సార్ సమస్యలు మూలాన ఈ సినిమా వాయిదా పడడం ఈ తతంగం కాస్తా హై కోర్ట్ వరకు కూడా వెళ్లి మొత్తం ఒక హై టెన్షన్ డ్రామాలా నడుస్తుంది.
అయితే నేడు తుది తీర్పు కోసమే అంతా ఎదురు చూసారు. మేకర్స్ తమకి అనుకూలంగానే తీర్పు వస్తుందని భావించి ఓవర్సీస్ మార్కెట్ డిస్ట్రిబ్యూటర్స్ కి ఫిబ్రవరి 6 డేట్ ని కూడా ఖరారు చేసుకోమన్నట్టు పలు రూమర్స్ వినిపించాయి. కానీ చివరి నిమిషంలో మొత్తం గేమ్ మారిపోయింది. అయితే ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని సింగిల్ బెంచ్ ఇది వరకే తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.
కానీ ఈ డెసిషన్ ని తమిళనాడు న్యాయస్థానం రద్దు చేసి ట్విస్ట్ ఇచ్చింది.మళ్ళీ విచారణ జరపాలని సూచించడంతో మళ్ళీ కథ మొదటికే వచ్చినట్టు అయ్యిందట. దీనితో జన నాయగన్ కి మళ్ళీ షాక్ తగిలించని చెప్పక తప్పదు. అలాగే ఈ సినిమా ఇప్పుడు ఫిబ్రవరి కూడా కాదు మార్చ్, మే నెలలో అంటూ రూమర్లు మొదలయ్యిపోయాయి. మరి జన నాయగన్ విషయంలో రిలీఫ్ ఎప్పటికి దక్కుతుందో చూడాలి.
