ఒక్క తమిళ ఆడియెన్స్ మాత్రమే కాకుండా తెలుగు ఆడియెన్స్ కూడా ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న సీక్వెల్ ఏదన్నా ఉంది అంటే అది ఖైదీ 2 అనే చెప్పాలి. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లిన సినిమా కూడా ఇదే. అయితే ఖైదీ 2 ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనే దానికి లోకేష్ సైడ్ నుంచి ఆన్సర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇది వరకే ఖైదీ 2 స్క్రిప్ట్ కంప్లీట్ చేసినప్పటికీ దీని బదులు మరో సినిమాలు తీయడంపై లోకేష్ ఓపెన్ అయ్యాడు.
ఇందులో ఢిల్లీకి కూతురు గా చేసిన చిన్నారి ఇపుడు బాగా ఎడిగిపోయింది అని అందుకే మళ్లీ స్క్రిప్ట్ లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అందుకే ఆల్రెడీ కంప్లీట్ చేసిన స్క్రిప్ట్ లో మరిన్ని మార్పులు చేయడంతో పాటుగా ఇతర సినిమాలు కూడా చేయాల్సి వస్తుంది అన్నట్టు తను రీసెంట్ ఇంటరాక్షన్ లో తెలిపారు.
