పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. దర్శకుడు హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) కాంబినేషన్లో ఈ సినిమా వస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఎప్పుడు ఏ అప్డేట్ వచ్చినా అభిమానులు ఫాలో అవుతున్నారు.
అయితే, తాజాగా ఈ చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేశారు. పూజా కార్యక్రమంతో ఈ డబ్బింగ్ వర్క్‌ను స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో దర్శకుడు హరీష్ శంకర్ కొన్ని పవర్ఫుల్ డైలాగులు రాశాడని.. అవి థియేటర్లలో విజిల్స్ వేయించడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మరోసారి తనదైన స్వాగ్ చూపించబోతున్నారు. అందాల భామలు శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.
#UstaadBhagatSingh dubbing begins on an auspicious note ✨
Get ready for the POWERFUL DIALOGUES penned by our CULT CAPTAIN 🔥🔥
POWER STAR @PawanKalyan @harish2you @sreeleela14 #RaashiiKhanna @ThisIsDSP @rparthiepan @DoP_Bose #AnandSai @Venupro @MythriOfficial @SonyMusicSouth… pic.twitter.com/wwvWeyXKVv
— Ustaad Bhagat Singh (@UBSTheFilm) January 27, 2026
