మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి కలయికలో తెరకెక్కించిన సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమే ‘మన శంకర ప్రసాద్ గారు'(Mana Shankara Vara Prasad Garu). మంచి అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్ర సంక్రాంతి బరిలో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఆల్రెడీ రీజనల్ గా ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు మొత్తం 15 రోజుల రన్ ని థియేటర్స్ లో కంప్లీట్ చేసుకుంది.
ఇక ఇలా ఫైనల్ గా ఈ సినిమా ఈ 15 రోజుల్లో ఏకంగా 358 కోట్ల గ్రాస్ ని ప్రపంచ వ్యాప్తంగా అందుకున్నట్టు మేకర్స్ రివీల్ చేశారు. దీనితో మన శంకర వర ప్రసాద్ గారు తో మెగాస్టార్ ఖాతాలో తెలుగు సినిమా బిగ్గెస్ట్ హిట్ రీజనల్ గా వేసుకున్నారని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రంలో వెంకీ మామ కీలక పాత్రలో నటించగా భీమ్స్ సంగీతం అందించాడు. అలాగే షైన్ స్క్రీన్స్ వారు, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.
When the BOSS arrives, records surrender 😎 😎
Megastar @KChiruTweets continues his record-breaking spree, setting yet another HISTORIC BENCHMARK in Telugu cinema ❤️🔥
₹358 Crore+ Worldwide Gross in 15 days for #ManaShankaraVaraPrasadGaru 💥
ALL-TIME REGIONAL INDUSTRY… pic.twitter.com/KXjfEREZ3w
— Gold Box Entertainments (@GoldBoxEnt) January 27, 2026
