ఓటిటి రిలీజ్ తర్వాత ‘ధురంధర్ 2’ టీజర్ కొత్త డేట్?

Dhurandhar 2

బాలీవుడ్ టాలెంటెడ్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా సారా అర్జున్ హీరోయిన్ గా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన లేటెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రమే “ధురంధర్”. మంచి అంచనాలు నడుమ వచ్చి ఇండియా వైడ్ గా బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఈ సినిమాకి సీక్వెల్ ‘ధురంధర్ 2’ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి ముందు టీజర్ పట్ల ఆసక్తి నెలకొంది. థియేటర్స్ లో పార్ట్ 1 క్లైమాక్స్ లో వేశారు కానీ ఆన్లైన్ లో మాత్రం అఫీషియల్ గా ఎలాంటిది కూడా రాలేదు. దీనితో ధురంధర్ 2 టీజర్ ట్రైలర్ ఎప్పుడు అనేది మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది.

అయితే ఈ టీజర్ ధురంధర్ 1 ఓటిటిలో వచ్చిన తర్వాత టీజర్ వస్తుంది అన్నట్టు ఇపుడు వినిపిస్తుంది. నెట్ ఫ్లిక్స్ లో పార్ట్ 1 ఈ జనవరి 30 నుంచి అందుబాటులో ఉంటుంది అని టాక్ గట్టిగా ప్రచారం జరుగుతుంది. ఇక ఈ డేట్ తర్వాత అంటే జనవరి 31న ధురంధర్ 2 టీజర్ రిలీజ్ చేస్తారట. సో దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా బయటకి రావాల్సి ఉంది.

Exit mobile version