లోకేష్, బన్నీ ప్రాజెక్ట్ ఆ రూమర్ లో నిజం లేదా?

AA Loki

రీసెంట్ గా అనౌన్సమెంట్ తోనే మంచి బజ్ ని క్రియేట్ చేసిన చిత్రాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అలాగే దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్ అనే చెప్పాలి. అంతకు ముందు వరకు కూడా కొన్ని రూమర్స్ ఉన్నాయి కానీ వాటిని ఫైనల్ గా నిజం చేస్తూ మేకర్స్ సాలిడ్ అనౌన్సమెంట్ ని అందించారు.

అయితే ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి లేటెస్ట్ గా మరో ఇంట్రెస్టింగ్ రూమర్ బయటకొచ్చి వైరల్ గా మారింది. దీంతో ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ నటిస్తుంది అన్నట్టుగా మొదలైంది. కానీ ఈ రూమర్స్ లో ప్రస్తుతానికి ఎలాంటి నిజం లేదట. ప్రస్తుతానికి మనకి ఆల్రెడీ ఏదైతే అనౌన్సమెంట్ వచ్చిందో..

హీరో, దర్శకుడు, సంగీత దర్శకుడు అలాగే నిర్మాణ సంస్థ ఇవి మాత్రమే అధికారికం అని తెలుస్తుంది. ఇంకా హీరోయిన్ కానీ ఇతర నటీనటులు ఎవరు అనేది ఏది ఫైనల్ కాలేదట. సో ఇప్పుడు వస్తున్న రూమర్స్ లో నిజం లేదనే అనుకోవచ్చు. మరి ఈ భారీ ప్రాజెక్ట్ కి అనిరుద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version