సినీ ప్రముఖుల నడుమ వైభవంగా హీరో సతీష్ జై కుమార్తె బర్త్‌డే!

Naira

‘అంతకుమించి’ చిత్ర కథానాయకుడు సతీష్ జై, డాక్టర్ మైత్రి షరణ్ దంపతుల కుమార్తె ‘నైరా’ మొదటి పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్‌లోని రాక్ హైట్స్ వేదికగా కన్నులపండువగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు.

ముఖ్య అతిథులుగా సునీల్ చలమలశెట్టి, నాయకులు కన్నా రావు, ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ, దర్శకులు రమేష్ వర్మ, కృష్ణ చైతన్య, రఘు కుంచె విచ్చేశారు. అలాగే నిర్మాతలు దాము, రాజేంద్ర రెడ్డి, సెవెన్ హిల్స్ సతీష్‌తో పాటు నటులు మధునందన్, జెమిని సురేష్, గగన్ విహారి, శ్రవణ్, జూనియర్ పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. వజ్ర ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఈ వేడుక అత్యంత వైభవంగా జరిగింది.

Exit mobile version